17.10.2026
సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తాగునీటికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ, యాసంగి సీజన్‌లో వరి సాగును తగ్గించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి గౌరవనీయులైన బెనహుర్ మహేష్ దత్ ఎక్కా గారు ఆదేశించారు.
కరీంనగర్ కలెక్టరేట్‌లో నాలుగు జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో నీరు, విద్యుత్ వినియోగంపై నిరంతర పర్యవేక్షణతో పాటు, చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులకు మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఆయిల్ పామ్, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించి, కనీస మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పథకం ద్వారా ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోరు రీచార్జ్ పనులు చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని, విద్యుత్ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.
వచ్చే వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా అమృత్ పనులను వేగవంతం చేసి, రానున్న ఆరు నుంచి ఎనిమిది నెలలకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అదనపు కలెక్టర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వ్యవసాయ, సాగునీటి, విద్యుత్, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, మార్కెటింగ్, పశుసంవర్ధక, మున్సిపల్ శాఖల అధికారులు, ఇతర సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
@PIBHyderabad