Lifetime Congress Man | Inspired by Karl Marx 🕵️ & Madam Sonia Gandhi ❤️

Gandhi Bhavan, Hyderabad
Rahul Gandhi: India Should Not Fear Jokers and Clowns Who Know Nothing of Our History or Philosophy రాహుల్ గాంధీ: మన చరిత్ర, తత్వశాస్త్రం తెలియని జోకర్లు, క్లౌన్లను చూసి భారత్ భయపడాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడుతున్నప్పుడు భయపడటం అర్థం చేసుకోవచ్చని, కానీ నేడు మన చరిత్ర, తత్వశాస్త్రం గురించి ఏమీ తెలియని శక్తులను చూసి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. దేశం పిరికితనంతో వ్యవహరించకుండా ధైర్యంగా నిలబడాలని స్పష్టం చేశారు. LoP Shri Rahul Gandhi said that while fear may be understandable when fighting the British Empire, there is no reason to be afraid of forces that know nothing about India’s history or philosophy. He stressed that India must stand with courage. #RahulGandhi #India
14
23
59
19,944
Public Sector Banks Are Assets of the People, Not for Sale | Rahul Gandhi's Letter to IDBI Bank Employees లాభాల్లోకి తీసుకొచ్చిన ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించడం ఎందుకు? ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులకు రాహుల్ గాంధీ లేఖ ఐడీబీఐ బ్యాంక్ కుటుంబ సభ్యులకు, గత ఏడాది మార్చిలో మీలో కొందరు పార్లమెంట్ హౌస్‌లో నన్ను కలవడానికి వచ్చారు. మీరు నన్ను ఒక సాధారణ ప్రశ్న అడిగారు. మీరు కష్టపడి లాభాల్లోకి తీసుకొచ్చిన బ్యాంకును ప్రభుత్వం ఎందుకు విక్రయిస్తోంది? ఆ ప్రశ్నను నేను లోక్‌సభలో లేవనెత్తాను. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకును ఎందుకు విక్రయిస్తున్నారు? ఆ బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారుల ప్రయోజనాలకు ఎలా రక్షణ కల్పిస్తారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. కానీ ప్రభుత్వం ఎలాంటి కారణం చెప్పలేదు. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంకును కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు విక్రయించాలని నిర్ణయించింది. ఐడీబీఐ ఒక మార్గదర్శక అభివృద్ధి బ్యాంకుగా ప్రారంభమైంది. వాణిజ్య బ్యాంకుగా మారే ప్రయాణం అంత సులభంగా సాగలేదు. అయినప్పటికీ మీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. ఏడేళ్ల క్రితం ఐడీబీఐ నష్టాల్లో ఉండేది. గత ఏడాది తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని ఆర్జించింది. ఈ విజయం మీ కృషి ఫలితమే. ప్రజల సొమ్ముతో నిర్మించిన సంస్థ ప్రజలకే చెందుతుంది. నేడు ఈ బ్యాంకులో ప్రభుత్వం, ఎల్‌ఐసీ కలిపి 95 శాతం వాటాను కలిగి ఉన్నాయి. విక్రయం తర్వాత వారి వాటా 34 శాతానికి తగ్గిపోతుంది. 2003లో ఐడీబీఐలో కనీసం 51 శాతం వాటాను ఎప్పటికీ తమ వద్దే ఉంచుకుంటామని ప్రభుత్వం పార్లమెంట్‌కు హామీ ఇచ్చింది. ఆ హామీ చట్టంలో రాసి ఉండకపోవచ్చు. కానీ పార్లమెంట్‌కు ఇచ్చిన హామీ అంటే భారత ప్రజలకు ఇచ్చిన హామీ. ఐడీబీఐ ప్రైవేటు యాజమాన్యంలోకి వెళ్లినప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కల్పిస్తున్న రిజర్వేషన్లు కూడా కనుమరుగవుతాయి. ఇప్పటికే బలహీనపడిన మీ ఉద్యోగ సేవా నిబంధనలు తమకున్న చివరి రక్షణను కూడా కోల్పోతాయి. ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం రెండూ బలంగా కలిసి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విశ్వసిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు విక్రయించాల్సిన ఆస్తులు కావు. అవి దేశ నిర్మాణానికి ఉపయోగపడే సాధనాలు. మీకు అండగా నిలబడాలని మీరు నన్ను కోరారు. నేటి మీ పోరాటంలో నేను మీకు అండగా నిలుస్తాను. మీ న్యాయమైన అన్ని డిమాండ్లకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఐక్యంగా ఉండండి. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. జై హింద్! రాహుల్ గాంధీ 29 అక్టోబర్ 2026 #RahulGandhi #IDBI
10
19
662
కరువు వస్తే రాష్ట్రాభివృద్ధి ఆపేయాలా? మీలా నాసిరకం ప్రాజెక్టులు కట్టట్లేదు... తెలంగాణకు నాణ్యమైన భవిష్యత్తు ఇస్తున్నాం! ---- కేటిఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చిన నరేందర్ రెడ్డి (టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్) ప్రెస్ మీట్లో మాట్లాడే తేదీ తెలియదు... నెల రోజుల క్రితం ప్రెస్ మీట్లో 'నేను ఉండటానికి ఇల్లే లేదు' అన్న కేటీఆర్, ఈరోజు ప్రెస్ మీట్లో 'నేను ఉంటున్న విల్లా పక్కన' అని మాట్లాడుతున్నాడు! రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం తప్పుడు ప్రచారం చేసి అలవాటైన కేటీఆర్‌కు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే 'గ్లోబల్ సమ్మిట్' కూడా గోబెల్స్‌లాగే కనిపిస్తోంది. మీలాగా నాసిరకం ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని ముంచేయడం లేదు... యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి నాణ్యమైన ప్రాజెక్టులు తెచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. కేటీఆర్... ఇప్పటికైనా అబద్ధాలు మానుకో! #RevanthReddy #KTR #GlobalSummit • @NYelamareddy
1
5
28
1,229
*తెలంగాణ రైజింగ్‌–2047 లక్ష్యం సాధ్యమే* * తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం * ఫార్మా, ఏరోస్పేస్‌, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌ రంగాల్లో అపార అవకాశాలు * తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ క‌ర్టెన్ రైజ‌ర్‌లో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ: తెలంగాణ నిర్దేశించుకున్న ‘తెలంగాణ రైజింగ్‌–2047’ లక్ష్యం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ.. సమష్టి కృషితో దానిని సాధించవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి విష‌యంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా స‌హ‌కరిస్తుంద‌న్నారు. రాష్ట్రంలో ఫార్మా, అంతరిక్షం, ఏరోస్పేస్‌, రక్షణ, ఎలక్ట్రానిక్స్‌, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్‌, ఆహార శుద్ధి, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్-2026 క‌ర్టెన్ రైజ‌ర్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టే ముందు పారిశ్రామికవేత్తలు ప్రధానంగా ఆశించేది విధానాల్లో స్థిరత్వం, నిబంధనల్లో స్పష్టత, వ్యాపార నిర్వహణలో పారదర్శకతేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇందుకు తెలంగాణ చరిత్రలోని కాకతీయుల కాలం నాటి ఉదాహరణను ప్రస్తావించారు. క్రీ.శ. 1244లో కాకతీయ పాలకుడు గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవులో జారీ చేసిన అభయ శాసనం సముద్ర వాణిజ్యంలో కీలక సంస్కరణలకు నాంది పలికిందన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు. * తెలంగాణ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లు తెలంగాణ నుంచి ఎగుమతులు పెంచేందుకు రాష్ట్రం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ సూచించారు. రాష్ట్రంలోని అత్యధిక ఎగుమతి సామర్థ్యం ఉన్న 50 ఉత్పత్తులు, సేవలను గుర్తించాలన్నారు. తెలంగాణలోని జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఇందుకు నాణ్యమైన ప్యాకేజింగ్‌, బ్రాండింగ్‌, ఉత్పత్తుల మూలాలను గుర్తించే ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. తాండూరు కందిపప్పు, చపాటా మిర్చి, నిజామాబాద్‌ పసుపు వంటి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో మంచి అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. వాటికి అంతర్జాతీయంగా మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటే రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు.ఇటీవల తాండూరు ఎర్ర కందిపప్పు ఉత్పత్తులను హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతి చేయడం తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు ఉన్న అవకాశాలకు నిదర్శనమని కేంద్ర మంత్రి అన్నారు. * ఫార్మా రంగంలో ఆవిష్కరణలకు ప్రాధాన్యం తెలంగాణ ఫార్మా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని గోయల్‌ సూచించారు. జనరిక్‌ ఔషధాల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, అధిక విలువ కలిగిన బ్రాండెడ్‌ ఔషధాలు, వినూత్న ఔషధాలు, బయోసిమిలర్ల తయారీపై దృష్టి పెట్టాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అంతరిక్షం, విమానయాన రంగాలు, విమాన విడిభాగాల తయారీ, నిర్వహణ-మరమ్మతు సేవలు (ఎంఆర్‌ఓ), రక్షణ పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌ రంగాల్లో తెలంగాన పెట్టుబడులను ప్రోత్సహించాలని చెప్పారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఈ సంద‌ర్బంగా జహీరాబాద్‌ పారిశ్రామిక స్మార్ట్‌ సిటీ, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధిని ఆయ‌న ప్ర‌స్తావించారు. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తేనే వివిధ పరిశ్రమల్లో ప్రపంచ స్థాయి నాయకత్వం సాధ్యమవుతుందని చెప్పారు. దీపావళి పండుగ స‌మ‌యంలో ఒక్కో దీపం వెలిగించడం ద్వారా వెలుగులు విస్తరించినట్లే.. ఒక్కో పెట్టుబడి, ఒక్కో ఎగుమతి, ఒక్కో కొత్త ఉద్యోగం, ఒక్కో స్టార్టప్‌ దేశాభివృద్ధికి దోహదపడతాయన్నారు. భారత్‌, తెలంగాణ భవిష్యత్తు ఉమ్మడి కృషిపైనే ఆధారపడి ఉందన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు తెలంగాణలోని అవకాశాలను పరిశీలించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ఆహ్వానించారు. ఈ పెట్టుబడుల ద్వారా ఉద్యోగాల సృష్టి, ప్రజల సంపద పెరుగుదల, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయని చెప్పారు. ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
7
35
1,634
పెట్టుబడులతో రండి.. రెట్టింపు లాభాలు పొందండి.. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు ఇదే మా ఆహ్వానం CM Revanth Reddy Assures Investment Security at Invest Telangana Global Summit 2026 Curtain Raiser
2
10
42
1,147
Telangana Aims to Become a $1 Trillion Economy by 2034 and a $3 Trillion Economy by 2047: CM Revanth Reddy at Invest Telangana Global Summit 2026 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ క‌ర్టెన్ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు * కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన‌ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం ప‌లుకుతున్నా... * కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, వాకాటి శ్రీహరి గారికి, మహ్మ‌ద్ అజారుద్దీన్ గారికి, పారిశ్రామికవేత్త‌లకు, విధాన రూప‌క‌ర్త‌ల‌కు, అధికారులకు, మిత్రులందరికీ స్వాగతం * డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌’కు మీ అందరినీ ఆహ్వానిస్తున్నా. * సుమారు 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ఒక ప్రపంచస్థాయి నగరంగా వెలుగులీనింది. * ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసరాలకు వచ్చి వ్యాపారాలు చేసేవారు. ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వెండి నకాషీ కళాకృతులను కొనుగోలు చేసేవారు. * నిజాం పాలకులు అద్భుతమైన కట్టడాలు, ప్రపంచస్థాయి మ్యూజియం, టంక‌శాల (నాణేల ముద్రణాలయం), విమానాశ్రయం, రైల్వేలు, అత్యుత్తమ విద్యా సంస్థలతో హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేశారు. * హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ ప్రపంచం గ‌ర్వించే మేధో నిపుణులు, నాయ‌కుల‌ను అందించింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ప్రేమ్ వత్స వంటి ప్రముఖులంతా హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. * విదేశీ పెట్టుబ‌డులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను తయారు చేయడంలో హైదరాబాద్‌కు ప్రత్యేకత ఉంది. * భారత దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో, దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన మహా నేతలను మ‌నం స్మరించుకోవాలి * ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల సమక్షంలో నిలబడి, దేశ ప్రగతికి బాటలు వేసిన ఆ మహానేతలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. * అతి పిన్న వయసులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ల రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నేడు ఫోన్‌, ఇంటర్నెట్‌ లేని జీవితాన్ని మనం ఊహించలేం. * రాజీవ్ గాంధీ హైదరాబాద్‌లో పైలట్ శిక్షణ పొందారు. పైలట్‌గా కూడా పనిచేశారు. అందుకే హైదరాబాద్‌లోని ప్రపంచస్థాయి విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టుకున్నాం. * 1991లో శ్రీ పీవీ నరసింహారావు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తెలంగాణ‌కు చెందినవారు. ఆ సమయంలో భారత్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఆయన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) సంస్కరణలను అమలు చేశారు. * హైదరాబాద్ జీవ‌నంలోనే ప్రపంచస్థాయి దృక్పథం ఉంది. సంస్కరణలను స్వీకరించే తత్వం, పారిశ్రామిక స్ఫూర్తి ఉన్నాయి. * 1991 నుంచి హైదరాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు అధికారంలోకి ఉన్నాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, హైదరాబాద్ పెట్టుబడుల ప్రస్థానానికి అంతా మద్దతుగా నిలిచారు. * నేను ఇక్కడ సుదీర్ఘంగా ప్రసంగించ‌డానికి రాలేదు. పెట్టుబడిదారుల అభిప్రాయాలను వినడానికి వచ్చాను. వ్యాపార రంగం గురించి మాకంటే మీకే ఎక్కువ అవగాహన ఉంది. మీ నుంచి నేర్చుకుంటాం, మీ అభిప్రాయాలను అర్థం చేసుకుంటాం, వాటిని ఆచరణలో పెడతాం. * ఈ సంద‌ర్భంగా ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. తెలంగాణలో మీరు పెట్టే పెట్టుబడులకు భద్రత కల్పించడం, అవి వృద్ధి చెందేలా చూడడం నా వ్యక్తిగత బాధ్యత. మీ పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటా. * ముందుగా మీకో విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ముందుగా మీ మనసులో ఒక సంఖ్యను నిర్ణయించుకోండి. ఆ మొత్తాన్ని ఇప్పుడు రెట్టింపు చేయండి! * మీరు ఆశిస్తున్న వృద్ధి అంచనాలను రెట్టింపు చేయండి. మీరు ఆశిస్తున్న లాభాలనూ రెట్టింపు చేయండి. * మీకు నా నుంచి ఏం కావాలో చెప్పండి. విధానపరమైన నిర్ణయాలైనా, ప్రభుత్వ సహకారమైనా, మీకు అవసరమైన మద్దతు అందించే బాధ్యతను నేను తీసుకుంటా. * ‘తెలంగాణ రైజింగ్ 2047’ తెలంగాణ భవిష్యత్ ప్రణాళిక. ఇది ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే, అందులో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలి. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉంది. * 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. * పెట్టుబడిదారుల్లో చాలామందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మ‌ధ్య‌న సంబంధాలపై సందేహాలున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పుడే చెప్పారు అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య సంబంధాలు ఏమిటనేది కేంద్ర మంత్రి చెప్పారు * దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో మూడు హైదరాబాద్‌కు అనుసంధానం కానున్నాయి. హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–పుణె మార్గాల్లో ఈ కారిడార్లు ఏర్పాటుకానున్నాయి. * వరంగల్‌, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరిస్తోంది. * రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మెట్రో రైలు విస్తరణ వరకు, నేవీ రాడార్ కేంద్రం నుంచి అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల వరకు కేంద్రం నుంచి సహకారం పొందుతున్నాం. * అభివృద్ధి విష‌యంలో ప్రభుత్వ జోక్యం కంటే, అవసరమైన చోట ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి అవకాశాలను విస్తరించాలి. మీ విజయపథంలో ఉన్న అడ్డంకులను తొలగించడమే నా పని. * హైదరాబాద్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలతో పోటీ ప‌డ‌దు. న్యూయార్క్‌, లండన్‌, టోక్యో, సియోల్‌, దుబాయ్‌ వంటి ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలి. * తెలంగాణ అభివృద్ధికి మీ అత్యుత్తమ ఆలోచనలను అందించండి. మంచి విధానపరమైన సూచనలు చేయండి. మీ సూచనలను పరిశీలించి, వాటిని ప్రభుత్వ విధానాలుగా అమలు చేస్తాం. * చివర‌గా, తెలంగాణ ఎదుగుతోంది. ఈ ప్రగతి ప్రస్థానంలో మీరూ భాగస్వాములు కండి. మనమంతా కలిసి ఎదుగుతూ చరిత్ర సృష్టిద్దాం. జై హింద్… జై తెలంగాణ #RevanthReddy #Telangana
1
6
22
852
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ Union Minister of Commerce and Industry Piyush Goyal addressing the curtain-raiser event of the Invest Telangana Global Summit 2026. #RevanthReddy #Telangana
8
45
1,442
Chalo Delhi | ఛలో ఢిల్లీ
Chalo Delhi | ఛలో ఢిల్లీ ఇది ఒక పార్టీ కొట్లాట కాదు... భారతీయుల ఓటు హక్కు రక్షణ పోరాటం! దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల పేర్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన ఓటును కాపాడేందుకు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. రాంలీలా మైదానానికి రండి! ఇవాళ గొంతు విప్పకపోతే... రేపు మన ఓటే మిగలదు! 📍 వేదిక: రాంలీలా మైదానం, న్యూఢిల్లీ 🗓️ తేదీ : నవంబర్ 1 (ఆదివారం) ✊ ఈ దేశంలో ప్రతి ఓటు కోసం గళమెత్తుదాం! #ChaloDilli #VoteBachaoDeshBachao #RahulGandhi #INDIA
6
27
1,089
మోడీకి మీడియా ఫోబియా జర్నలిస్టులను ఫేస్ చేసే ధైర్యం మోదీ చేయరు * రాజకీయాల్లో ఎన్ని గెలిచామన్నది ముఖ్యం కాదు ఎక్కడ గెలిచామన్నది ముఖ్యం * బీజేపీ కంచుకోట లో బుల్లెట్ దించామా లేదా? * బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో నాగపూర్ లో కాంగ్రెస్ గెలిచి సత్తా చూపించాం * మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లో ఎస్పీ అభ్యర్థులను గెలిపించారా ?లేదా? * వారణాసి లో బీజేపీ ఓటమి మోదీ కాలానికి చెప్ప పెట్టులాంటింది * కాంతి సింగ్ అవినాష్ కుమార్ పై మంచి మెజార్టీ తో గెలిచారు * బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీ ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్నాలో ఆర్జేడీ అభ్యర్థి విజయం సాధించారు * పూణే లో ఎన్సీపీ అభ్యర్ధి హర్షత్ దేశ ముఖ్ విజయం సాధించారు * గోరఖ్ పూర్ లో 307 చావు తప్పి కన్నులొట్ట మాదిరి బీజేపీ విజయం * నాగ్ పూర్, వారణాసి, గోరఖ్ పూర్ పరిస్థితి ఏంటన్నది మోదీ జవాబు చెప్పాలి * నైతికత ఉంటే మోదీ సమాధానం చెప్పాలి * నాగ్ పూర్ గెలిచి మోదీ చాతిమీద కొట్టాం * యువత లో మోదీ పాలన పై అసంతృప్తి * వారణాసి లో బీజేపీ అభ్యర్థి ఓటమి బీజేపీ పాలనకు నిదర్శనం * బీజేపీ సిద్ధాంతాలను ప్రజలు చీ కొడుతున్నారు కాబట్టే నాగ్ పూర్ లో ఓటమి * బంకీపుర్ నుంచ వారణాసి వరకు బీజేపీ అభ్యర్థుల ఓటమి అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తికి నిదర్శనం * బీజేపీ అగ్రనేతల కంచుకోటల్లో ఆ పార్టీ నేతల ఓటమి మోదీ పాలనపై వ్యతిరేకతకు నిదర్శనం * రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు గుణపాటం * సర్ పై జరిగిన ఉద్యమం,పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ అరాచక పాలనకు నిదర్శనం * రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యం * సర్ తో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం * సర్ పై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు * కుంటిసాకులు చెప్పే వారికీ చెంపపెట్టు * రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి రైళ్ల నిరాకరణ కుట్ర * ప్రధాని మంత్రి, హోంమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి మేరకు రైళ్ల నిరాకరణ * రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుంది * అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీకి తరలిస్తాం * సర్ ప్రక్రియ దేశంలో అలజడి సృష్టించింది * రాష్ట్రానికి అమిత్ షా రాక వల్ల ప్రయోజనం శూన్యం * అమిత్ షా తో ఒరిగేది ఏమి లేదు * ఎల్ నినో ప్రకృతి విప్పత్తు * బటన్ తిప్పితే ఎల్ నినో వస్తుందని హరీష్ అనుకుంటున్నారు * సిద్దిపేట ప్రజలు హరీష్ మాటలు చూసి నవ్వుకుంటున్నారు * విపత్తులు వస్తే రాజకీయాలు చేయడం తగదు * ఇష్టానుసారం మాట్లాడితే బండకేసి కొడతారు * కరోనా విపత్తు వస్తే కేసిఆర్ పారాసీటామాల్ అంటూ వేళాకోళం * కొండ సురేఖ కు బాసటగా ఉంటాం * అనిరుధ్ నిధుల అంశం క్రమశిక్షణ కమిటీ పర్యవేక్షిస్తుంది * నిధుల కొరత బిఆర్ఎస్ పాపం --- టీపీసీసీ అధ్యక్షులు & ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం
1
18
46
1,384
A March for the Soul of India: Rahul Gandhi Appeals to Students, Youth Across Party Lines to Join 'Chalo Dilli' ఛలో ఢిల్లీ: "ఓటు కాపాడుకుందాం – దేశాన్ని రక్షించుకుందాం!" నవంబర్ 1 రాంలీలా మార్చ్‌కు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి పిలుపు ఇది ఏ ఒక్క పార్టీ కోసమో చేస్తున్న పోరాటం కాదు... భారతదేశ ఆత్మను కాపాడుకునే ప్రజా ఉద్యమం! రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్న ఈ సమయంలో యువత, విద్యార్థులు, పౌరులంతా ఒక్కటి కావాల్సిన సమయం వచ్చింది. లాఠీలకు, పోలీసులకు భయపడకండి... దేశ రక్షణ కోసం నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానానికి తరలిరండి! 📍 వేదిక: రాంలీలా మైదానం, ఢిల్లీ 🗓️ తేదీ: నవంబర్ 1 #ChaloDilli #VoteBachaoDeshBachao #RahulGandhi #SaveDemocracy
11
30
59
1,223
Chandni Chowk Traders Express Support for Rahul Gandhi and Priyanka Gandhi రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి చాందినీ చౌక్ వ్యాపారుల మద్దతు చాందినీ చౌక్ వ్యాపారులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు మద్దతు ప్రకటిస్తూ, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. మోదీకి ఏమీ తెలియదని, అబద్ధాలు చెప్పడం మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. - చాందినీ చౌక్ వ్యాపారులు Chandni Chowk traders express strong support for Rahul Gandhi and Priyanka Gandhi, criticizing Prime Minister Modi for allegedly relying on lies rather than leadership. - Traders of Chandni Chowk
14
45
1,339
ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాయంత్రం “ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్” కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.
5
34
1,242
Congress for Telangana retweeted
"Jo Jeeta Wohi Sikandar!": Congress's Abhijit Wanjari Celebrates Historic Win Over BJP in Nagpur MLC Polls. "జో జీతా వోహి సికందర్..!" – నాగ్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి అభిజీత్ వంజారి మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక నాగ్‌పూర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిజీత్ వంజారి చారిత్రక విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహ్‌లేపై సాధించిన ఘనవిజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు: - బీజేపీ అభ్యర్థి ఓటమిని జీర్ణించుకోలేక 'ఎలిమినేషన్ రౌండ్ గెలుపు' అని సాకులు చెబుతున్నారని, కానీ ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిస్తే వాళ్లే సికందర్ అని అభిజీత్ ఎద్దేవా చేశారు. - నియోజకవర్గంలో ఆరేళ్లుగా తాము చేసిన పనికి, ఉపాధ్యాయ–ఉద్యోగ సంఘాల మద్దతుకు దక్కిన ప్రతిఫలమే ఈ గెలుపని స్పష్టం చేశారు. - ఇది ప్రచారం కంటే వ్యూహాల మధ్య జరిగిన ఎన్నిక.. అందుకే శక్తి కంటే యుక్తే గెలిచింది" అంటూ తమ పక్కా ప్లానింగ్ వల్లే బీజేపీ కంచుకోట బద్దలైందని తెలిపారు. #Nagpur #NagpurElection
1
25
98
3,056
Hi Prends 🫶 MLC Election Results Update Modi - Varanasi - LOST🔻 RSS - Nagpur - LOST🔻
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka. Elections held using ballot papers. Guess how many seats Congress won? 🧐
34
69
337
10,048
Congress Lead's Nagpur Graduate MLC Official First-Preference Vote Tally CONGRESS LEAD : 927 votes 👉 Abhijit Govindrao Wanjari (Congress): 28,998 👉 Sudhakar Vitthalrao Kohale (BJP): 28,071 👉 Nitesh Balkrushnaji Karale (Independent): 14,708 #nagpur #NagpurGraduatesConstituency
1
8
34
1,822
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పాల్గొని కరువు నివారణ, తాగునీరు–సాగునీటి లభ్యత, విద్యుత్ సరఫరా, రైతులకు అండగా నిలిచే చర్యలపై తమ విలువైన సలహాలు, సూచనలు అందించారు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ— రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం. అవసరమైతే అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని కోరుతాం అని అన్నారు. అఖిలపక్ష నేతలు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చడం, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడడం, పశువులకు నీరు, మేత అందించడం వంటి అంశాలపై సమన్వయంతో కార్యాచరణ చేపడతాం అని డిప్యూటీ సీఎం గారు అన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలి. శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలతో పాటు అన్ని రాజకీయ పార్టీల సలహాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటాం అని పేర్కొన్నారు. ప్రజలకు, రైతులకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు అన్నారు.
12
27
1,326
రేపు ఢిల్లీ వెళ్లనున్న... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
5
22
1,533
Sadar Festival Committee Invites CM Revanth Reddy to November 4 Celebrations at NTR Stadium ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు. వచ్చే నెల 4న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సదర్ ఉత్సవాలకు ఆహ్వానం. సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపిన క‌మిటీ ప్ర‌తినిధులు. కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, యాదాద్రి బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, ఇతర నాయకులు. #RevanthReddy #Telangana
10
42
2,014
Telangana Youth Congress Leader Indujaa Files Complaint Against KTR, Seeks SC/ST Atrocities Case Over Alleged Social Media Harassment and Misinformation మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బల్మూర్ ఇందుజా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వేధింపుల ఆరోపణలకు సంబంధించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వినతి. • @VenkatBalmoor • @GaddamInduja
10
36
225
27,238
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలి – డిగ్రీ సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారి ధృవీకరణ నిబంధనను తొలగించాలి Extend Graduate Voter Enrolment Deadline by Four Weeks and Remove Mandatory Gazetted Officer Attestation for Degree Certificates రానున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ (MBNR–RR–HYD), వరంగల్–ఖమ్మం–నల్గొండ (WGL–KMM–NLG) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్ర ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ సి. సుధర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ కు టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్, ఎస్ఐఆర్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గంప వేణుగోపాల్ వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ నవంబర్ 6వ తేదీ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు చివరి తేదీగా ఉన్న నేపథ్యంలో, అనేక మంది అర్హులైన పట్టభద్రులు అవగాహన లోపం, అవసరమైన పత్రాల సేకరణలో ఇబ్బందులు, ధృవీకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల కారణంగా గడువులోగా నమోదు చేసుకోలేకపోయే అవకాశం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు గడువును కనీసం మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరడం జరిగినది. అదే సమయంలో, విద్యాసంస్థలు, ప్రైవేట్ టెక్ పార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగినది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీ సర్టిఫికెట్ల ప్రతులపై గెజిటెడ్ అధికారి ధృవీకరణ తప్పనిసరి చేయడం వల్ల దరఖాస్తుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గెజిటెడ్ అధికారులను సంప్రదించడం, ధృవీకరణ పొందడం కోసం సమయం వెచ్చించాల్సి రావడంతో నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ఫారం-18తో పాటు సమర్పించే డిగ్రీ సర్టిఫికెట్లను ఎన్నికల అధికారులు ఆన్‌లైన్ ద్వారా ధృవీకరించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. నిబంధనలకు అనుగుణంగా, స్వీయ ధృవీకరణ (Self-Attestation) చేసిన సర్టిఫికెట్లను లేదా ఇతర ప్రత్యామ్నాయ ధృవీకరణ పద్ధతులను అనుమతించడం ద్వారా పట్టభద్రుల నమోదు ప్రక్రియను సులభతరం చేయవచ్చని సూచించారు. గత పర్యాయం ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు శాతం తక్కువగా కనిపిస్తోందన్న ఆందోళనను కూడా వినతిపత్రంలో ప్రస్తావించడం జరిగినది. నమోదు ప్రక్రియలో ఉన్న అదనపు నిబంధనలు అర్హులైన పట్టభద్రులకు ఇబ్బందిగా మారకుండా, ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ రోజు డెక్కన్ క్రోనికల్ దినపత్రికలో ప్రచురించింబడ్డ శీర్షిక ప్రకారం సుమారు 5లక్షల ఓటర్లను ఎస్ఐఆర్ కు ముందే ఫారం 7 ద్వారా తొలగించబడిందని, ఈ ఫారం 7 ఏఐ జనరేటెడ్ ఆ లేదా ఫీజికల్ వొచ్చాయా, ఈ ఫారం 7 వివరాలు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగినది, అలాగే ఈ 5లక్షల ఫారం 7 వివరాలు పునః పరిశీలించాలని కోరం జరిగినది. ప్రధాన డిమాండ్లు: - గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు గడువును కనీసం నాలుగు వారాలు పొడిగించాలి. - విద్యాసంస్థలు, ఐటీ టెక్ పార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. - తెలంగాణలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల డిగ్రీ సర్టిఫికెట్లకు గెజిటెడ్ అధికారి ధృవీకరణ తప్పనిసరి నిబంధనను తొలగించే అంశాన్ని పరిశీలించాలి. - ఆన్‌లైన్ ధృవీకరణ లేదా నిబంధనలకు అనుగుణమైన స్వీయ ధృవీకరణ పద్ధతుల ద్వారా నమోదు ప్రక్రియను సులభతరం చేయాలి. - ఈ సంవత్సరం ఎస్ఐఆర్ కి ముందే ఓటర్ జాబితా నుండి 5 లక్షల ఓటర్ల తొలిగింపు పై పునః పరిశీలించాలి. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఎంతో అవసరమని పేర్కొంటూ, నవంబర్ 6వ తేదీ గడువుకు ముందే ఈ అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ముఖ్య ఎన్నికల అధికారిని కోరడం జరిగినది. -పులిపాటి రాజేష్ కుమార్, చైర్మన్, టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ. Extend Graduate Voter Enrolment Deadline by Four Weeks and Remove Mandatory Gazetted Officer Attestation for Degree Certificates Pulipati Rajesh Kumar, Chairman of the TPCC Election Commission Coordination Committee, and Gampa Venugopal, State Coordinator for SIR, submitted a representation to Shri C. Sudharshan Reddy Garu, IAS, Chief Electoral Officer of Telangana, requesting measures to simplify the enrolment process for eligible graduate voters ahead of the forthcoming elections to the Mahabubnagar–Rangareddy–Hyderabad (MBNR–RR–HYD) and Warangal–Khammam–Nalgonda (WGL–KMM–NLG) Graduate MLC Constituencies. The representation highlighted that November 6 is the last date for graduate voter enrolment and expressed concern that many eligible graduates may be unable to register within the stipulated deadline due to a lack of awareness, difficulties in obtaining the required documents, and procedural hurdles in the verification process. In this regard, they requested that the graduate voter enrolment deadline be extended by at least four weeks. They also urged the Election Commission to conduct extensive voter awareness campaigns across educational institutions, private technology parks, and rural areas to ensure that every eligible graduate gets an opportunity to enrol as a voter. They further pointed out that the mandatory requirement of Gazetted Officer attestation on copies of degree certificates issued by recognised universities within Telangana is causing considerable inconvenience to applicants. The need to approach Gazetted Officers and obtain the necessary attestation is resulting in delays and creating additional barriers to the enrolment process. They requested the Chief Electoral Officer to consider permitting election officials to verify degree certificates submitted along with Form-18 through online systems. They also suggested allowing self-attested copies of degree certificates or other alternative verification methods, wherever permissible under the applicable rules, to simplify the registration process without compromising verification standards. The representation also expressed concern that graduate voter enrolment appears to be lower compared with the previous term's elections. They urged the authorities to take appropriate steps to remove unnecessary procedural difficulties and increase voter participation. ### Request for Clarification and Review of Removal of Five Lakh Voters The representatives also referred to a headline published in Deccan Chronicle on the same day, according to which approximately five lakh voters had reportedly been removed from the electoral rolls through Form 7 before the commencement of the Special Intensive Revision (SIR). They sought clarification on whether these Form 7 applications were AI-generated or physically submitted. They also requested that the details of the Form 7 applications be provided and that the removal of the approximately five lakh voters be thoroughly reviewed to ensure transparency and accuracy in the electoral rolls. ### Key Demands - Extend the graduate voter enrolment deadline by at least four weeks. - Conduct extensive voter awareness campaigns across educational institutions, IT parks, and rural areas. - Review the mandatory Gazetted Officer attestation requirement for degree certificates issued by recognised universities within Telangana. - Simplify graduate voter enrolment through online verification or self-attestation, wherever permissible under the applicable rules. - Review the reported removal of five lakh voters from the electoral rolls before the commencement of this year's SIR and provide details of the associated Form 7 applications. Emphasising that every eligible graduate must have a fair opportunity to register as a voter, the representatives urged the Chief Electoral Officer to consider these requests favourably and take appropriate action before the November 6 deadline. They stated that simplifying the enrolment process and ensuring transparency in electoral roll management are essential to strengthening democratic participation. — Pulipati Rajesh Kumar Chairman TPCC Election Commission Coordination Committee • @OMGampa
11
19
2,234