Home Minister, Andhra Pradesh || Politburo Member, TDP || President, Telugu Mahila (AP) || MLA - Payakaraopeta | t.me/VangalapudiAnitha

విజయవాడ వైభవాన్ని మరోసారి ఘనంగా చాటేందుకు రూపుదిద్దుకుంటున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’కు ఆహ్వానం అందుకోవడం సంతోషంగా ఉంది. మన ఆధ్యాత్మికత, సంస్కృతి, కళలు, సంప్రదాయాల సమ్మేళనంగా నిలిచే ఈ ప్రతిష్టాత్మక వేడుకలో భాగస్వామ్యం కావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారికి, ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్ తేజస్విని పొడపాటి గారికి నా ధన్యవాదాలు. #VijayawadaUtsav2 #Vijayawada #AndhraPradesh #CultureAndTradition #VijayawadaCelebrations
6
7
121
2,281
పెట్టుబడులు పెరుగుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా, యువతకు ఉద్యోగాల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగు. ఇదే మన కూటమి ప్రభుత్వ అభివృద్ధి దిశ. #AndhraPradesh #InvestInAP #IndustrialGrowth #EmploymentOpportunities #DevelopmentAgenda
3
3
20
878
శిక్ష న్యాయాన్ని నిలబెడితే… సంస్కరణ భవిష్యత్తును నిర్మిస్తుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని శ్రీ ఎన్. సురేష్ గారు బీఏలో ఏపీ, తెలంగాణల్లో అత్యధిక సగటు మార్కులు సాధించి మెరిటోరియస్ గోల్డ్ మెడల్, బుక్ ప్రైజ్ అందుకోవడం గర్వకారణం. విద్య, క్రమశిక్షణ, సంకల్పంతో జీవితాన్ని మార్చుకోవచ్చనే స్ఫూర్తిదాయక నిదర్శనం ఇది. శ్రీ ఎన్.సురేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. @naralokesh @ncbn #AndhraPradesh #PrisonReforms #EducationForChange #SecondChances #AndhraPradesh #PublicWelfare #Amaravati
3
5
30
1,816
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన 12 కీలక అంశాలపై చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికలపైనా చర్చ జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానంపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించాం. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా, అభివృద్ధి - సంక్షేమానికి మరింత వేగం అందించే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. #AndhraPradesh #CabinetMeeting #StateDevelopment #PublicWelfare #Amaravati
3
10
69
1,828
కెనైన్‌ విధుల్లో కనిపించేది క్రమశిక్షణ కానీ ఆ క్రమశిక్షణ వెనుక నిలిచేది ఒక హ్యాండ్లర్‌ అంకితభావం. ప్రతి అడుగు, ప్రతి ఆదేశం, ప్రతి విజయానికి వెనుక ఎంతో ఓర్పుతో, నిబద్ధతతో కెనైన్స్‌కు శిక్షణనిచ్చే హ్యాండ్లర్ల కృషి అభినందనీయం. అమరావతిలో కెనైన్ హ్యాండ్లర్ల 23వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొని, ప్రజల భద్రత కోసం సిద్ధమవుతున్న ఈ అంకితభావపు బృందాన్ని అభినందించడం ఎంతో గర్వంగా అనిపించింది. మన పోలీసు బలగాలకు నమ్మకమైన తోడుగా నిలుస్తున్న ప్రతి కెనైన్‌ దాని వెనుక ఉన్న ప్రతి హ్యాండ్లర్‌కు నా హృదయపూర్వక అభినందనలు. #CanineHandlers #PoliceForce #PublicSafety #Amaravati #DutyAndDedication
1
7
34
1,398
నిన్నటి భారత్‌ను చూసిన తరం, నేటి భారత్‌ను నిర్మిస్తున్న తరం, రేపటి వికసిత్ భారత్‌ను కలలు కంటున్న తరం ఈ మూడు తరాల ప్రయాణంలో 25 ఏళ్ల ప్రజా సేవ ఒక ప్రత్యేక అధ్యాయం. మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఇండియా వరకు, పారిశ్రామిక ప్రగతి నుంచి సెమీకండక్టర్ సామర్థ్యం వరకు. దేశ భవిష్యత్తును ముందుగానే దృష్టిలో పెట్టుకుని సాగిన ఈ ప్రయాణం ఎన్నో కొత్త అవకాశాలకు బాటలు వేసింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానంపై హృదయపూర్వక శుభాకాంక్షలు. 2047 వికసిత్ భారత్ లక్ష్యం సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ మహత్తర ప్రయాణంలో భాగమైన మన తరానికి ఇది ఎంతో గర్వకారణం. రాబోయే తరాలకు మరింత బలమైన భారత్‌ను అందించే దిశగా సాగుతున్న ఈ ప్రస్థానం మనందరికీ స్ఫూర్తిదాయకం. @narendramodi #25YearsOfSeva
3
61
1,707
ప్రతి చిన్నారి తన కలలను పెద్దగా చూడాలి ఆ కలలకు సరైన వేదిక మన ప్రభుత్వ పాఠశాలల్లోనే సిద్ధం కావాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సురక్షితమైన అభ్యాస వాతావరణం అందించే దిశగా మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ దిశగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చూపిస్తున్న చొరవ, తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయం. రేపటి తరాన్ని తీర్చిదిద్దే పాఠశాలలు, నేటి నుంచే మార్పుకు ప్రతిరూపాలుగా నిలవాలి. #ManaBadiManaBhavishyath #QualityEducation #GovernmentSchools #NaraLokesh #FutureOfStudents
3
45
1,875
మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది సుమారు 25 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, రద్దీ నియంత్రణ, భద్రత, ట్రాఫిక్, క్యూలైన్లు, తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సదుపాయాలు వంటి అన్ని అంశాలపై పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా అమ్మవారి దర్శనం కల్పించడమే మా కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. #DasaraNavaratri #KanakaDurga #Vijayawada #DevoteeFirst #AndhraPradesh
6
9
62
2,203
భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం, ప్రశాంతమైన దర్శనమే లక్ష్యం. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, సహచర మంత్రులతో కలిసి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించడం జరిగింది. 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, రద్దీ నియంత్రణ నుంచి వైద్య సదుపాయాల వరకు ప్రతి అంశంపై పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రతి భక్తుడూ సంతృప్తిగా అమ్మవారిని దర్శించుకునేలా మా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.
1
7
34
2,914
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. సహచర మంత్రులతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకుని, ఆలయ అధికారులు, పండితులు అందించిన ఆలయ మర్యాదలను స్వీకరించి, వేద ఆశీర్వచనాలు పొందాను. అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను భక్తిశ్రద్ధలతో స్వీకరించాను. అమ్మవారి కరుణాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. #KanakaDurga #Vijayawada #DivineBlessings #AndhraPradesh #PublicWelfare
1
18
233
5,202
మహిళల జీవితాల్లో మార్పు కనిపించాలి, ఆ మార్పుకు ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పుడు తోడుగా ఉంటాయి. ప్రయాణ భారం తగ్గించడం నుంచి ఉపాధి, ఆర్థిక అవకాశాలు పెంచడం వరకు మహిళల కోసం ప్రతి అడుగు సాధికారత దిశగానే. మహిళలకు అండగా నిలవడం కాదు, వాళ్లు తమ కాళ్లపై తాము నిలబడేలా బలమివ్వడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. #WomenEmpowerment #WomenWelfare #WomenPower #KutamiGovernment #AndhraPradesh
1
5
24
806
రైతు సంక్షేమంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగంలో మరో ముందడుగు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరువైతే.. నిర్ణయాలు మరింత సులభమై, వ్యవసాయం మరింత లాభసాటిగా మారుతుంది. రైతుల అభివృద్ధి, సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని సాంకేతికతను వ్యవసాయానికి అనుసంధానిస్తున్న కూటమి ప్రభుత్వం. #FarmerWelfare #AgriTech #SmartFarming #AgricultureDevelopment #FarmersFirst #Andhrapradesh
8
7
40
1,733
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం మరింత పెరుగుతోంది. విశాఖపట్నం నుంచి విజయవాడ, గుంటూరు, నెల్లూరు వరకు నగరాలు వాణిజ్యం, పరిశ్రమలు, సేవలు, మౌలిక వసతుల్లో కొత్త అవకాశాలకు కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. ప్రతి నగరం తన ప్రత్యేక బలంతో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పడేలా, ప్రజలకు మరిన్ని అవకాశాలు అందేలా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. #AndhraPradeshDevelopment #EconomicGrowth #UrbanDevelopment #InfrastructureDevelopment #KutamiGovernment
9
16
108
3,355
పాయకరావుపేటలో చేపట్టిన పాదయాత్రలో భాగంగా లక్కీ షాపింగ్ మాల్‌ను సందర్శించి, మేనేజ్‌మెంట్‌తో పాటు అక్కడికి వచ్చిన వినియోగదారులతో కాసేపు ముచ్చటించడం ఆనందంగా అనిపించింది. పాదయాత్రలో ప్రజలను నేరుగా కలుసుకుంటూ, వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నదే నా లక్ష్యం. #PeopleConnect #Payakaraopeta #PublicService #PeopleFirst #CommunityConnect
4
16
121
3,756
ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ మోడల్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం మన రైతుల కృషికి దక్కిన గౌరవం. తక్కువ పెట్టుబడి, తక్కువ సాగు ఖర్చు, రైతుకు మరింత భరోసా, ప్రకృతి వ్యవసాయంతో సుస్థిర వ్యవసాయానికి ఏపీ బాటలు వేస్తోంది. మన రైతు బలపడాలి, మన భూమి పచ్చబడాలి, మన ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవాలి! #NaturalFarming #APFarmers #SustainableAgriculture #GreenAndhraPradesh #FarmersFirst
1
13
84
2,505
స్వచ్ఛతను ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజల బాధ్యతగా మార్చినప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యం. అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ద్వారా పరిశుభ్రత, సేవాభావంతో ముందుకు సాగుతున్న వారిని సత్కరించడం ఆనందంగా ఉంది. గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త జల భరోసా వచ్చిన వేళ.. అనకాపల్లి జిల్లా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందేలా మనమంతా కలిసి ముందుకు సాగుదాం. #SwachhAndhra #SwarnaAndhra #CleanAndhraPradesh #Anakapalli #DevelopmentWithPeople
1
8
36
1,694
మత్తు పదార్థాల నిర్మూలనపై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి సాగు, అక్రమ రవాణా మూలాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటూ, యువతను డ్రగ్స్‌ బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తును కాపాడే ఈ పోరాటంలో పోలీసు శాఖతో పాటు ప్రజల సహకారాన్ని కూడా కోరుతున్నాను. డ్రగ్స్‌కు తావులేని, యువతకు సురక్షితమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే మా లక్ష్యం. #DrugFreeAndhraPradesh #SayNoToDrugs #DrugFreeYouth #YouthForAP #AndhraPradesh
7
13
69
2,227
అనకాపల్లి శ్రీ నూకాంబికా అమ్మవారి సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. #NookambikaAmma #Anakapalli #TempleVisit #AnithaVangalapudi #HomeMinister
1
11
113
2,585
అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నాను. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారితో కలిసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో ఆధ్యాత్మికమైన అనుభూతిని కలిగించింది. #Nookambika #Anakapalli #VangalapudiAnitha #AmmaVariAashirvadam #HomeMinister #AndhraPradesh
2
13
116
3,443