శ్రీకాకుళం మహిళా కళాశాలకు గొప్ప చరిత్ర, ఘనమైన వారసత్వం, జిల్లాలో ప్రత్యేకమైన గౌరవం ఉంది. అయితే ఆ ఘనతను కాపాడుకోవడంతో పాటు, కళాశాల ఎదుర్కొంటున్న పారిశుధ్యం, పర్యావరణ సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులు, అధికారులు మరియు సిబ్బందితో కలిసి కళాశాల ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టి, ప్రాంగణాన్ని మరింత పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దే దిశగా తొలి అడుగు వేశాం.
గత వారం కళాశాలను సందర్శించినప్పుడు, కళాశాల పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు తిరిగి వచ్చి చర్యలు చేపడతానని హామీ ఇచ్చాను. ఆ హామీలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం.
ఇది ఒక్కరోజు కార్యక్రమంతో ముగిసే ప్రయత్నం కాదు. దశలవారీగా కళాశాల మౌలిక వసతులను మెరుగుపరచి, పారిశుధ్యాన్ని పెంపొందించి, పచ్చదనాన్ని అభివృద్ధి చేసి, శ్రీకాకుళం మహిళా కళాశాల పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తాం.