Deputy Chief Minister of Telangana || Minister for Finance, Planning & Energy ||Member of @incindia || MLA, Madhira

Hyderabad, India
Bhatti Vikramarka Mallu retweeted
मैं तीन साल से वोट चोरी का पर्दाफ़ाश करता आ रहा हूँ। अब चुनाव आयुक्त खुद इसे स्वीकार कर सच्चाई उजागर कर रहे हैं। ज्ञानेश कुमार ने देशद्रोह किया है। वो अभी इस्तीफ़ा दें और approver बन जाएं। वोट चोरी की साज़िश में नरेंद्र मोदी और अमित शाह की पूरी जांच होगी।
1,877
13,551
44,856
703,780
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, అనిల్ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే వధూవరులు అంజిలి–రఘు లను ఆశీర్వదించాము. @realyssharmila
19
477
15,932
2030 నాటికి తెలంగాణను పేదరిక రహిత రాష్ట్రంగా, 2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా రాష్ట్ర సమగ్ర, దీర్ఘకాలిక అభివృద్ధి కార్యాచరణపై ప్రజా భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధాన నిర్ణయాలు: • TSDPS బలోపేతంతో ప్రత్యేక PMU ఏర్పాటు • జిల్లాల వారీగా డేటా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు • కీలక రంగాల పురోగతికి ఏడు సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్ • ప్రభుత్వం–GFST భాగస్వామ్యానికి MoU ప్రతిపాదన • పనుల పర్యవేక్షణకు పకడ్బందీగా KPIs, డ్యాష్‌బోర్డులు పేదరిక నిర్మూలన, మౌలిక వసతులు, ఆరోగ్యం, పట్టణీకరణ, పశుసంపద, ఆక్వాకల్చర్ రంగాల్లో నిర్దిష్ట లక్ష్యాలతో రాష్ట్ర ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాం. #Telangana #PrajaPalana
3
10
30
1,821
తెలంగాణను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాభవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కలిసి పర్యాటక, సాంస్కృతిక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించాను. మన రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ 'తెలంగాణ బ్రాండ్'ను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించాను. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ద్వారా కొత్త ప్రాజెక్టులు చేపట్టి, స్థానిక యువతకు ఉపాధి కల్పన, ఆదాయ వనరుల పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాను. టెంపుల్, ఎకో, హిల్ టూరిజం సర్క్యూట్ల అభివృద్ధి, రామప్ప వంటి చారిత్రక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల కోసం 'తెలంగాణ దర్శిని' కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. #TelanganaTourism #Telangana
1
9
43
1,659
ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారితో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో విద్యుత్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాం. దసరా నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. ప్లాంట్‌కు అవసరమైన జీ-9 గ్రేడ్ బొగ్గు సరఫరాపై త్వరలోనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారితో చర్చిస్తాను. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల, పిట్ హెడ్ కాకుండా దూరంగా నిర్మించిన కారణంగా బొగ్గు రవాణా నిమిత్తం రాష్ట్రంపై దాదాపు రూ. 40 వేల కోట్ల అదనపు భారం పడుతోంది. సింగరేణిలో జీ-9 గ్రేడ్ బొగ్గు లభ్యత లేకపోవడంతో పాటు గతంలో వేలంలో పాల్గొనకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై సమీక్షించాం. ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా, తాత్కాలికంగా మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుండి బొగ్గు కొనుగోలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం.
2
16
60
2,137
రాష్ట్ర సచివాలయంలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్- 2026 సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, డిసెంబర్ 7 నుంచి 9 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రపంచ పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష జరిపాము. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ఆర్థిక ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చే ఈ చారిత్రాత్మక సదస్సు నిర్వహణకు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశాము. దేశ, విదేశాల్లో విస్తృత రోడ్‌షోలు, వార్‌రూమ్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ఎక్కడా రాజీ పడకుండా ఈ సమ్మిట్‌ను అత్యంత విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశాను. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల ప్రధాన గమ్యస్థానంగా నిలపడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం. @UttamINC @OffDSB @azharflicks @minister_adluri
5
14
35
2,122
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి అద్యక్షతన జరిగిన SC/ST (POA) చట్టం అమలుపై ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. దళితులు, గిరిజనుల అభ్యున్నతి, రక్షణ కోసం మా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అరికట్టేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయడంతో పాటు బాధితులకు సకాలంలో న్యాయం, సహాయ పునరావాసం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. బాధితులకు సహాయం అందించే విషయంలో బడ్జెట్ అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని నిర్ణయించాం. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే అట్టడుగు వర్గాల జీవితాల్లో శాశ్వత మార్పు సాధ్యం. సామాజిక న్యాయం, సమానత్వమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
4
19
51
2,270
శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల పవిత్ర సందర్భంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.
1
13
60
2,330
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించాను. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావం, తాగు, సాగునీటి కొరత, ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలందరినీ కాపాడాలని, రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నాను.
16
58
1,857
తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
2
8
27
1,580
Bhatti Vikramarka Mallu retweeted
#WATCH | Delhi: At the conference on 'Financing India's Journey Towards a Developed India' (Viksit Bharat), Telangana Deputy Chief Minister Mallu Bhatti Vikramarka says, “...all the states throughout the country are participating with their plan of action to reach the goals they have set for 2047. Last year, on December 9, announced at a global summit that Telangana's target is a $3 trillion economy by 2047..."
1
2
13
19,207
తెలంగాణ ప్రజల నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి, గ్రావిటీ ద్వారా మన ప్రాంతాలకు సాగునీరు అందించడానికి మా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో సిద్ధంగా ఉంది. తెలంగాణకు అత్యంత కీలకమైన ప్రాణహిత ప్రాజెక్టు కోసం కేవలం 2,000 నుండి 3,000 ఎకరాల భూమి అవసరమైతే, ఆనాడు కేంద్రాన్ని గానీ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ ఒప్పించడంలో బీఆర్ఎస్, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయి. తుమ్మిడిహెట్టి వద్ద ముంపునకు గురయ్యే భూములకు మార్కెట్ రేటు కంటే రూపాయి ఎక్కువే పరిహారంగా చెల్లించడానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
4
17
39
1,983
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కొత్తూరు 132 కేవీ సబ్‌స్టేషన్ జూనియర్ లైన్‌మ్యాన్ మహమ్మద్ ముజాహిద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 కోటి ప్రమాద బీమా చెక్కును ముజాహిద్ తల్లిగారికి అందజేశాను. ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవడమే మా ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత. #TGTransco #TelanganaGovt
3
12
73
4,574
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో నేడు ప్రజా సంక్షేమం, ప్రాంతీయ ప్రగతిని కాంక్షిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు రూ. 2.90 కోట్లతో చిరుమర్రి చెరువు వద్ద పర్యాటక వసతుల అభివృద్ధి పనులకు శ్రీకారం. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేలా రూ. 40 లక్షలతో ముదిగొండ మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన. వనంవారి కృష్ణపురం గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ. గ్రామీణ మౌలిక వసతుల కల్పన, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. #Khammam #Telangana #PrajaPalana #BhattiVikramarkaMallu
5
8
20
1,881
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని పెద్దకంజర్ల నేరేడు చెరువులో గణేష్ నిమజ్జనం వేళ శిరీష ఛారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు మునిగి మృతి చెందిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసింది. చిన్నారులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటాం. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సాయం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా అధికారులను ఆదేశించాము. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశాను.
1
8
31
2,192
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. 1,000 రోజుల పాలనలో మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతితో పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ ప్రతి ఇంటా వెలుగులు నింపాం. అన్నదాతలకు అండగా నిలుస్తూ చారిత్రాత్మక రుణమాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టుల వేగవంతమైన నిర్మాణంతో వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాం. ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఆధునిక వైద్యశాలల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు, పారదర్శక భూ రీ-సర్వేతో నవ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేశాం. సబ్బండ వర్గాల సంక్షేమమే పరమావధిగా మా ప్రజా పాలన నిరంతరం కొనసాగుతుంది.
5
11
46
2,650
నాడు రాచరిక పాలనకు ముగింపు పలికి, ప్రజాస్వామిక భారత యూనియన్‌లో తెలంగాణ అంతర్భాగమైన చారిత్రక దినమిది. తెలంగాణ నేల కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ… వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల హక్కులు, సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న ప్రజాపాలనను ముందుకు నడిపిద్దాం. తెలంగాణ ప్రజలందరికీ 'ప్రజాపాలన దినోత్సవ' శుభాకాంక్షలు. #PrajaPalanaDay #Telangana #September17
10
12
51
1,612
Telangana’s rapid expansion across industries, data centres, and urban infrastructure will drive rising energy demands. The state’s strategy focuses on decoupling growth from waste leveraging renewable energy, conventional power, and Artificial Intelligence to ensure every unit generated delivers maximum economic and environmental value. Backed by robust infrastructure, connectivity, and skilled human capital, Telangana offers a prime ecosystem for global investors, entrepreneurs, and industries committed to sustainable, energy efficient growth.
3
14
37
1,647
Addressed the CII 25th Energy Efficiency Summit–2026 at HICC Novotel today. Energy efficiency is not merely about environmental preservation, but a vital economic strategy. Every unit of power saved is the cheapest unit produced. Urged industry leaders to eliminate energy waste by adopting AI, digitalization, and smart management under the guiding principle: Measure, Share, and Scale. As Telangana powers rapidly toward becoming a $3 Trillion economy by 2047, our focus remains on maximizing output per unit of energy consumed. Extended an invitation to global investors to partner in our journey at the upcoming Telangana Rising Global Summit this December. #EnergyEfficiency #CII2026 #TelanganaRising #BhattiVikramarkaMallu
2
7
28
1,599